ట్రాన్స్ పోర్ట్ మోటార్ వెహికల్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సి.ఐ.టి.యు నేతలు ధర్నా నిర్వహించారు. ఈ బిల్లుపై ఎన్నో పోరాటాలు చేసినా, కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తోందన్నారు. బిల్లు చట్టంగా మారితే అనేకమంది మోటార్ వెహికల్ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు, రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. 2013 ట్రాన్స్ పోర్ట్ మోటార్ వెహికల్ బిల్లు ప్రవేశపెట్టిన అప్పటి ప్రభుత్వం కేవలం ప్రముఖ కంపెనీలు టాటా, అశోక్ లేలాండ్ వంటి వాటికి ఉపయోగపడేలా చట్టం పొందించారని...ఇప్పటి ప్రభుత్వం కూడా అదే పద్దతిని అనుసరిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి : గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయి ప్రాణాలు