అనంతలో చిరు అభిమానుల సందడి మెగాస్టార్ చిరంంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విజయవంతం చేయాలంటూ అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో అభిమానులు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిరు అభిమానులు ప్రత్యేకంగా రూపొందించిన సైరా టీ షర్ట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సైరా నరసింహారెడ్డి చిత్రం కు సంబంధించిన గోడల ప్రతులు, హోర్డింగ్లను సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: వామ్మో: ఈ యువకులు ఎలుగుబంటికే చుక్కలు చూపించారు!