అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతిపై బంధువులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని రాణినగర్కు చెందిన విజయలక్ష్మి అనే మహిళ ప్రసవం కోసం 26వ తేదీన ఆసుపత్రిలో చేరింది. అదే రోజు పాపకు జన్మనిచ్చింది. ఆరోజు నుంచి తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శిశువు కదల్లేదు. వెంటనే వైద్యులకు చెప్పగా.. పరీక్షలు చేసి పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందినట్లు నిర్ధరించారు. నాలుగు రోజులు బాగానే ఉన్న పాప ఎలా చనిపోయిందంటూ శిశువు తల్లిదండ్రులు వాదనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందంటూ ప్రసూతి విభాగం ఎదుట నిరసన చేపట్టారు. వీరికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పగా ఆందోళన విరమించారు. బాధిత తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: