అనంతపురం జిల్లాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు బాబు ప్రసాద్ కుటుంబానికి రూ.40 లక్షల 90 వేల చెక్కును... జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు మృతుని భార్య చంద్రకళకు అందజేశారు. ఈ ఏడాది మార్చిలో బాబు ప్రసాద్ ప్రమాదంలో మృతి చెందారు.
రాష్ట్ర పోలీసు శాఖ ముందు చూపుతో... యాక్సిస్ బ్యాంకులో శాలరీ జమ చేస్తున్న పోలీస్ సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే, యాక్సిస్ బ్యాంక్ పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా రూ. 30 లక్షలు బీమా ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రూ.30 లక్షల చెక్కును అందజేశారు. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ద్వారా మరో రూ. 10 లక్షల 90 వేల చెక్కును సైతం చంద్రకళకు అందజేశారు.
ఇదీ చదవండి: