ఎన్నో పోరాటాల తర్వాత మీటర్లు లేకుండా రైతులు ఉచిత విద్యుత్ సాధిస్తే.. అప్పు కోసం రైతు బతుకుల్ని తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇది అత్యంత దుర్మార్గపూరితమైన చర్యని మండిపడ్డారు. అనంతపురం లోక్ సభ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఆయన వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ప్రజావ్యతిరేక విధానాలతో వైకాపా ప్రభుత్వం అప్రతిష్ట పాలైందని దుయ్యబట్టారు.
వైకాపాకు ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలకు తెదేపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతికి తాను ముఖ్య ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమేనని చంద్రబాబు అన్నారు. కానీ.. భవిష్యత్తులో అలాంటి తప్పు జరగబోదని హామీ ఇస్తున్నట్లు తెలిపారు.
ఏ ప్రాంతంలో ఎవరి నాయకత్వం ఎప్పుడు అవసరమో గుర్తించి.. వారికి బాధ్యతలు అప్పగిస్తానన్నారు. అందరం కలిసి మళ్లీ తెదేపాను అధికారంలోకి తెచ్చేలా పరిశ్రమించి రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించుకుందామని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: