ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అవలంబిస్తోందని... ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు ఆరోపించారు. అనంతపురంలో ప్రజా సంఘాలతో పీడీఎస్యూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న వరవరరావు, సాయిబాబా లాంటి వారిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు.
అలాంటి వారిని ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మత వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అరెస్టులు చేయడం ఏంటని మండిపడ్డారు. వరవరరావు, సాయి బాబాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కల్పించి వ్యతిరేకత చాటుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
పరీక్షల కోసం ప్రజలు ఎదురుచూపులు... కిట్లు లేవంటూ పంపేస్తున్న అధికారులు