ETV Bharat / state

Car Crashed Into Pond: వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి - అనంతపురంలో రోడ్డు ప్రమాదం

CAR ACCIDENT: నిర్మాణంలో ఉన్న వంతెన.. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేని పరిస్థితి.. దీంతో అదుపు తప్పి కారు వంకలోకి దూసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్​లో జరిగింది. హైదరాబాద్ నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి
author img

By

Published : Dec 30, 2021, 8:18 AM IST

Updated : Dec 30, 2021, 9:47 AM IST

వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

CAR ACCIDENT: అనంతపురం జిల్లా విడపనకల్ మండలం డోనేకల్​లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బళ్లారి వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వంకలోకి దూసుకెళ్లింది. దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో పడిపోయింది. ఇదీ గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి నుంచి క్రేన్ల ద్వారా కారును బయటకు తీసేందుకు ప్రయత్నించగా చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈరోజు ఉదయం కారు బయటకు తీయగా ఓ మృతదేహం లభ్యమైంది.

మృతుడు కర్ణాటక రాష్ట్రం బళ్లారి ప్రాంతానికి చెందిన అశ్వత్ నారాయణగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లో ఉన్న తన కుటుంబ సభ్యులను కలిసి తిరిగి బళ్ళారికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అతని స్నేహితులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని వారు వెళ్లి పరిశీలించగా అక్కడ హెచ్చరిక బోర్డు లేకపోవడంతోనే ఈ ప్రమదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చురుకుగా ఉండే మంచి మిత్రుడిని కోల్పోయామని స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

జేఈపై గ్రామస్థుల ఆగ్రహం..

రెండు సంవత్సరాలు గడుస్తున్నా..బ్రిడ్జి మరమ్మతులు చేపట్టకపోవటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడికి వచ్చిన జేఈ పై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి:

Subramanian Swamy: ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి: భాజపా నేత సుబ్రమణ్యస్వామి

Last Updated : Dec 30, 2021, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.