మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు వచ్చిన వారికి అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేశారు.
ఇదీచదవండి.