అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని కార్వేటి నాగేపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీపతిరెడ్డిది వ్యవసాయ కుటుంబం. భార్య, ఇద్దరు కుమారులతో జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. చిన్న కుమారుడు ఉదయ్ కిరణ్‌కు బ్రెయిన్ ట్యూమర్ సోకింది. బెంగళూరులోని కిద్వాయ్ వైద్యశాలలో 2 శస్త్రచికిత్సలు చేయించారు. అప్పుడు ఉదయ్ వయసు మూడేళ్లు. అనంతరం ఆరోగ్యం మెరుగుపడి అందరిలానే పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ ఉండేవాడు. అయితే ఉదయ్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి మరోసారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. ఈసారి శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నాలుగేళ్లుగా ఆ బాలుడు మంచానికే పరిమితమయ్యాడు.
ఉన్న ఎకరం పొలం, బంగారు నగలు అమ్మేసి కుమారుడికి వైద్యం చేయించారు ఉదయ్ తల్లిదండ్రులు. 10 లక్షలకు పైగా ఖర్చయ్యింది కానీ.. వ్యాధి నయం కాలేదు. ప్రస్తుతం బాలుణ్ని వారానికోసారి వైద్య పరీక్షల కోసం బెంగళూరుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. అందుకోసం ప్రతి వారం 15 నుంచి 20 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని వారు వాపోయారు. ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన కుటుంబం.. కుమారుడికి వైద్యం చేయించలేక మానసికంగా మరింత కుంగిపోతుంది.
ఈ పరిస్థితుల్లో పెద్ద కుమారుడికి ఫీజులు కట్టలేక ఇంటర్‌తో చదువు మాన్పించారు. ప్రభుత్వం, దాతలు స్పందించి తమ కుమారుడి వైద్యానికి చేయూతనందించాలని ఉదయ్‌కిరణ్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: