పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సావాల్లో భాగంగా అనంతపురం జిల్లా కదిరిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని శాసన సభ్యుడు సిద్ధారెడ్డి రక్తదాతలు, పోలీసు అధికారులను అభినందించారు. పోలీసుల సేవలను గుర్తుంచుకొని వారోత్సవాలు జరుపుకోవటం బాధ్యతగా భావించాలని ఎమ్యెల్యే అన్నారు.
కర్నూలు జిల్లా
పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కర్నూలులో కొనసాగుతున్నాయి. పోలీసు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో పోలీసులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చదవండి:విశాఖలో పోలీస్‌శాఖ వర్క్‌షాప్ ..