ETV Bharat / state

గుంతకల్లులో వివాదాస్పదంగా సేవా హీ సంఘటన్

author img

By

Published : Jun 2, 2021, 7:37 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో నిర్వహించిన సేవా హీ సంఘటన్ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. కరోనా రోగులకు ఆహారం అందిస్తున్న తమపై పోలీసులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని బీజేవైఎం నేతలు ఆరోపించారు.

BJYM leaders protest at gunthakal ananthapuram district
గుంతకల్లులో వివాదాస్పదంగా సేవా హీ సంఘటన్

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద 18 రోజులుగా బీజేవైఎం సభ్యులు కరోనా రోగులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. ఈ భోజనం పంపిణీలో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదంటూ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన నిర్వాహకులు.. ఉద్దేశపూర్వకంగానే స్థానిక డీఎస్పీ ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా నల్ల దుస్తులు, బ్యాడ్జిలు ధరించి సేవను కొనసాగిస్తామని బీజేవైఎం నేతలు తెలిపారు. ఈ ఘటనపై గుంతకల్లు డీఎస్పీ షర్ఫుద్దీన్​ను వివరణ కోరగా.. భోజన పంపిణీ కేంద్రం వద్ద తాము జరిమానా వేయలేదని, మంగళవారం కారులో వచ్చిన వారికి చలాన్ వేశామని వెల్లడించారు.

ఇదీచదవండి.

కొవిడ్ నివారణ చర్యలపై మంత్రి కన్నబాబు సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.