అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కదిరి పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో అధికార, విపక్ష పార్టీ నేతలు హామీ ఇచ్చారని బీజేవైఎం నాయకులు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి హోదాలో కదిరి వచ్చిన చంద్రబాబు... ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఐదేళ్లలో నెరవేరలేదన్నారు.
అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్న వైకాపా నేతలు... 6 నెలలు గడుస్తున్నా దీనిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. తెదేపా, వైకాపా నేతల తీరును నిరసిస్తూ... బీజేవైఎం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
ఇదీ చూడండి: నత్తనడకన కంచికచర్ల బైపాస్ రోడ్డు పనులు