ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీలో భారీగా జరిగిన అవకతవకలపై అధికార పార్టీ నేతలు చర్చలకు రావాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. అనంతపురం జిల్లా దేవగిరిలో భాజపా కార్యకర్తలకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండా వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈరోజు బాధితులను పరామర్శించిన విష్ణువర్ధన్‌రెడ్డి అర్హులైన వారికి ఇళ్లపట్టాలివ్వాలని స్థానిక తహసీల్దార్‌ను కోరారు.
రాష్ట్రంలో భాజపా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేవాలయాలపై దాడులకు వైకాపా, తెదేపా పార్టీలు బాధ్యత వహించాలన్నారు.
ఇదీచదవండి