అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మృతి బాధాకరమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కరోనా రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సంఘటనపై ముఖ్యమంత్రి వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం అన్నది.. కచ్చితంగా వైద్య అధికారుల నిర్లక్ష్యమేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. ఆక్సిజన్ అందకే అంటున్న బంధువులు