భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకుల అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలోని జాతీయ రహదారి 42 పై ఇందిరా గాంధీ కూడలిలో భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర భాజపా పిలుపు మేరకు చలో అమలాపురానికి బయలుదేరిన నాయకులను.. అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. అరెస్ట్ చేసిన నాయకులను భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. భాజపా, జనసేన నాయకులను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఇవీ చూడండి...