కొవిడ్ రోగులకు సరైన చికిత్స అందించటంలో ప్రభుత్వం విఫలమైందని భాజపా హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి ఆన్నారు. కదిరి ప్రాంతీయ ఆసుపత్రిలోని కొవిడ్ విభాగాన్ని ఆ పార్టీ నాయకులు సందర్శించి.. రోగులకు అందిస్తున్న సేవలు తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో కోవిడ్ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోందని, ప్రాంతీయ వైద్యశాల పరిధిలోని 80 పడకల ద్వారానే బాధితులకు సదుపాయం అందుబాటులో ఉందని చెప్పారు. తగినన్ని పడకలు లేని కారణంగా కదిరిలో 60 మందికి పైగా కరోనా సోకిన వారు మృతి చెందారని భాజపా నాయకులు అన్నారు.
మరిన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించి ఉంటే మృతుల తగ్గించి ఉండేదని అన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత వల్లే ఎక్కువ మంది మృతి చెందారని ఆరోపించారు. మండలాలకు ప్రధాన ఆసుపత్రి అయిన వంద పడకల వైద్యశాలలో వెంటిలేటర్ సదుపాయం అందుబాటులో లేని కారణంగా.. కరోనా బాధితులకు పూర్తి చికిత్స అందించలేక పోయారని తెలిపారు. ప్రభుత్వం అంచనా వేసి కదిరిలో ఆరోగ్యశ్రీ కింద ఉన్న సాయినాథ్ ఆసుపత్రి, త్రివేణి ఆసుపత్రి, అమీర్ ఆసుపత్రుల్లో బాధితులకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: