ఉరవకొండలో రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బస్సు... డిపోలోకి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న సోమప్ప, ఓబులపతికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి
తాడేపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి