ETV Bharat / state

బెంగాల్ కూలీల రైలు ఆగిపోయింది.. కారణం ఇదే!

స్వరాష్ట్రాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. ఉన్నచోట ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నామని వలస కూలీలు ఆవేదన చెందుతున్నారని అనంతపురం స్టేషన్ మేనేజర్ తావు నాయక్ తెలిపారు. బెంగాల్ కు వెళ్లాల్సిన వలస కూలీల రైలు ఆగిపోయింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు అందిన వెంటనే రైలు ఇక్కడి నుంచి బయలుదేరుతుందన్నారు.

bengal migrate workers train is stoped
నిలిచిపోయిన వలస కూలీల ట్రైన్​
author img

By

Published : May 10, 2020, 2:46 PM IST

అనంతపురం నుంచి బెంగాల్ రాష్ట్రానికి వలస కూలీలను తీసుకొని వెళ్లాల్సిన రైలు ఆగిపోయింది. జిల్లాలో బెంగాల్ పరిసర ప్రాంతాలకు వెళ్ళవలసిన వలస కూలీలు మొత్తం 1463 మంది ఉండగా, రైలులో 1200 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలవుతుందన్నారు. ఈ కారణంగానే రైలు ఆపాల్సి వచ్చిందని స్టేషన్ మేనేజర్ తావు నాయక్ చెప్పారు.

అదనపు బోగీలు ఏర్పాటు చేయాలా లేక ఉన్న బోగీలోనే అందర్నీ తరలించి విజయవాడలో మరొక ట్రైన్​లోకి మార్చాలా అన్నదానిపై జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టత రావాలన్నారు. అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇవ్వనుందున నిన్న సాయంత్రం 4:30కి బయలుదేరాల్సిన వలసకూలీల రైలు ఆపాల్సి వచ్చిందని స్టేషన్ మేనేజర్ తెలిపారు.

ఇవీ చూడండి...

బెంగళూరు టూ ఉత్తరప్రదేశ్​... వయా అనంతపురం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.