అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలోని జలపాతం, పచ్చని చెట్లు.. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం కొత్త రూపు సంతరించుకుంది. ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అటు వైపు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు, అందమైన జలపాతాన్ని చూసి ఆనందిస్తున్నారు. జలపాతాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి అనేక మంది పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
ఇదీ చదవండి