అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామ సమీపంలోని గొర్లకనంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది. మోటువారిపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు గాయపడ్డాడు. వెంటనే పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి: