అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. టవర్ క్లాక్ ప్రాంతం వర్షపు నీటితో నిండిపోయింది. ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ఈదురుగాలుల దాటికి దాదాపు 3 ఎకరాల్లో అరటి పంట నెలకొరిగింది. 2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. చేతికొచ్చిన పంట ఇలా అకాల వర్షం కారణంగా నేలకొరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉద్యానశాఖ అధికారులు స్పందించి పరిహారం అందించాలని కోరారు. వేరుశెనగ, ఇతర పంటలు సైతం దెబ్బతిన్నాయని వారు కలత చెందుతున్నారు.
ఇవీ చూడండి..: ఉట్ల తిరుణాలతో ముగిసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు..