అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మూడెకరాల అరటితోట నేలకూలింది. గుడిబండ మండలం పీఎన్ పాల్యం గ్రామంలో బలమైన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి... శివన్న అనే రైతు పొలంలో అరటి తోట పూర్తిగా నాశనమైంది. నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి అరటి పంట సాగు చేశానని.... పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తనను నట్టేట ముంచిందని శివన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.
ఇదీ చదవండి: ఔరా! నూర్: చెకచెకా ఎక్కి.. కరెంటు తీగలపై నడిచి..