అనంతపురం పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి రోడ్డు సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సోములదొడ్డి గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మకుడు రవి విధులకు హాజరయ్యేందుకు నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీచదవండి