అనంతపురం జిల్లా మడకశిర మండలం అక్కంపల్లి గ్రామంలో ఉన్న మడకశిర చెరువుకు హంద్రీనీవా జలాలు చేరి నిండుకుండలా తయారైంది. అదేవిధంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులో నీరు చేరి జలకళ సంతరించుకుంది. అధిక విస్తీర్ణంలో చెరువుగట్టు ఉండడంతో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఈ ప్రదేశాన్ని పర్యటక కేంద్రంగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
చెరువు చుట్టూ గట్టుపై రకరకాల మొక్కలతో, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులతో, పర్యటకులను ఆకట్టుకునే విధంగా నమూనా చిత్రపటాన్ని తయారు చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు ఈశ్వరయ్య పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నర్రవాడలో యునిసెఫ్ ప్రతినిధి పర్యటన