ETV Bharat / state

'మగ గొంతు వింటేనే భయపడేలా' మైనర్​పై అకృత్యాలు - పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయవాద దంపతుల దారుణం - app crime on uravakonda

Attrocities on Minor Girl by Public Prosecutor: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఉంటూ మైనర్ ను పనిలో పెట్టుకుని చిత్రహింసలకు గురిచేసిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వీరిని వెంటనే అరెస్టు చేయాలని ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల డిమాండ్ చేస్తున్నాయి.

Attrocities_on_Minor_Girl_by_Public_Prosecutor

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 1:00 PM IST

'మగ గొంతు వింటేనే భయపడేలా' మైనర్​పై అకృత్యాలు - పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయవాద దంపతుల దారుణం

Attrocities on Minor Girl by Public Prosecutor: న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ న్యాయాన్ని కాపాడవలసింది పోయి అన్యాయంగా మైనర్ పై దారుణానికి పాల్పడ్డారు ఓ దంపతులు. పేరుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. పబ్లిక్ సమస్యలు తీర్చకపోగా వీరే పబ్లిక్​కు సమస్యగా మారారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేస్తున్న దంపతులు ఒక బాలికను పనికి కుదుర్చుకున్నారు. మైనర్ ను పనిలో పెట్టుకోవడమే నేరం కాగా.. పైగా చిత్రహింసలకు గురిచేస్తున్నారు ఆ దంపతులు. చిత్ర హింసలకు గురైన ఆ బాలిక ఆసుపత్రిలో చేరడంతో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Couple Torturing Girl for 5Years: అనంతపురం జిల్లా ఉరవకొండ కోర్టులో వసంతలక్ష్మి ఆమె భర్త అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌(Assistant public prosecutor -APP)గా పనిచేస్తున్నారు. మైనర్లచే వెట్టిచాకిరి చేయించకూడదని తెలిసి కూడా వీరి ఇంట్లో పనిచేసేందుకు ఓ బాలికను పనికి కుదుర్చుకున్నారు. బాలికను పనిలో చేర్చుకోవడమే కాకుండా బాలికను ఒంటిపై తీవ్రగాయాలు అయ్యేలా చిత్రహింసలకు గురి చేశారు ఆ దంపతులు. ఈ నెల 17న బాలిక చిత్రహింసలతో తీవ్ర అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ సంఘటన బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

"5సంవత్సరాలుగా వసంతలక్ష్మి,ఆమె భర్త వద్ద ఆ బాలిక పనిచేస్తుంది. ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల్లో ఆమె అత్యాచారానికి గురైనట్టు తేలింది. బాలిక మగవారి గొంతు వింటుంటేనే భయానికి లోనవుతోంది. దోషులకు శిక్షపడేలా చేసి బాలికకు తగిన న్యాయం చేయాలి." - భానుజ, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ఛైర్‌పర్సన్‌

వసంత లక్ష్మి, ఆమె భర్త కూడా బాలికను చిత్రహింసలకు గురిచేసినట్లు పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న బాలిక మానసికంగా కోలుకున్న తరువాత వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు కారణం ఎవరు, అసలు బాలికకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయన్న దానిపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ బాలిక ఇచ్చే వాంగ్మూలంలో ఎవరెవరు ఇబ్బంది పెట్టారో, ఎవరు దాడి చేశారో తెలిసే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. బాలిక ఇచ్చే వాంగ్మూలం ద్వారా ఎవరిని వదలబోమని పోలీసులు స్పష్టం చేశారు. దోషులు ఎంతటి వారైనా, ఏ హోదాలో ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అమ్మాయిలు, మహిళలకు న్యాయం చేయడం విషయంలో రాజీపడబోమని పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.