ETV Bharat / state

Attack: వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు..ఇద్దరు నేతలకు గాయాలు - అనంత వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మల్లకుంట గ్రామంలో వైకాపా మండల కన్వీనర్ భయపురెడ్డిపై అదే పార్టీకి చెందిన వారు కర్రలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న భయపురెడ్డి వర్గీయులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నేతలు తీవ్రంగా గాయపడ్డారు.

వైకాపా నాయకుడిపై దాడి
వైకాపా నాయకుడిపై దాడి
author img

By

Published : Jun 14, 2021, 7:29 PM IST

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మల్లకుంట వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైకాపా మండల కన్వీనర్ భయపు రెడ్డిపై అదే పార్టీకి చెందిన ప్రత్యర్థులు దాడి చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భయపు రెడ్డిపై అదే గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, బాలరెడ్డి తదితరులు కర్రలతో దాడి చేశారు. చికిత్స నిమిత్తం అతనిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న భయపు రెడ్డి వర్గీయులు..బత్తలపల్లిలో అమర్నాథ్ రెడ్డిపై దాడి చేశారు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి

Cm jagan: గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.