ఏటీఎంలలో నగదు కాజేసిన వ్యక్తిని.. అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.10,38,970 నగదు, ఏటీఎం కార్డులను స్వాదీనం చేసుకున్నారు. సీఐ ప్రతాపరెడ్డి తెలిపిన వివరాల మేరకు బ్యుజినెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో దేవరకొండ సాయికుమార్ ఏటిఎం క్యాష్ లోడర్ గా పని చేసేవాడు. 9 నెలల క్రితం ఈ ఉద్యోగములో చేరాడు. అనంతపురం, గార్లదిన్నె, కూడేరు ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో క్యాష్ లోడ్ చేస్తూ.. సంస్థ నమ్మకాన్ని పొందాడు. ఇదే అదనుగా.. డబ్బు కాజేయాలని పథకం పన్నాడు. ఏటీఎం లలో నగదును ఉంచిన తరువాత ఇతనొక్కడే లోనికి వెళ్లి అందులో వున్న నగదును ఎత్తుకెళ్లాడు. రూ. 18,97,000/- పలు దఫాలుగా కాజేశాడు.
ఈ నగదును తన వ్యసనాలకు వాడుకున్నాడు. తేడాలు గమనించిన రైటర్స్ బ్యుజినెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనంతపురం బ్రాంచ్ హెడ్ రామాంజినేయులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు బృందంగా ఏర్పడి స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో దేవరకొండ సాయికుమార్ ను అరెస్టు చేశామన్నారు. కేసును త్వరగా ఛేదించిన సిబ్బందిని అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి అభినందించారు.
ఇదీ చదవండి: