బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభియోగంపై రిమాండ్‌లో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ విచారించేందుకు కడప నుంచి అనంతపురం తీసుకువచ్చారు. వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ఓ గదికి సీసీ కెమెరాలు అమర్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాది రవికుమార్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ జరగనుంది.
మరో ముగ్గురు అరెస్టు...
ఇదే కేసుకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై తాడిపత్రి పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో దివాకర్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ నాగేశ్వర్‌రెడ్డి, ఆకుల రమేష్, గుత్తా సోమశేఖర్‌లను కూడా కస్టడీలోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దాదాపు 70 లారీలను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: అమాయకులను నమ్మబలుకుతాడు... అందినకాడికి దోచుకుంటాడు