అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే రక్త నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థల ఐకాస ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. 24 గంటల తరువాత స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి.. ఈ మేరకు హామీ ఇవ్వగా.. వారు దీక్ష విరమించారు. ఎమ్మెల్యే స్వయంగా కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపచేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... ఎన్నికల్లో గుంతకల్లులో ప్రభుత్వ రక్త నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని దానికి తాము కట్టుబడి ఉన్నామని... నెలరోజుల్లోపు ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు వచ్చేలా చేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ఐకాస నాయకులు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని దీక్షను విరమించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఐకాస నేతలు దీక్ష విరమించారు.
ఇవీ చదవండి:
విద్యుదాఘాతంతో తండ్రీకుమారులు మృతి