అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది. పట్టణంలోని భాగ్యనగర్‌లో ఆర్మీ వైద్యుడు కార్తీక్ వర్ధన్.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆగ్రాలోని మిలిటరీ హాస్పిటల్లో మేజర్‌గా ఉంటూ వైద్యుడిగా విధులు నిర్వహించే కార్తీక్.. సెలవుల మీద గతవారం గుంతకల్లులోని తన ఇంటికి వచ్చారు. అతని భార్య కూడా వైద్యురాలే. ఆమె ఆగ్రాలోని మిలటరీ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తూ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తోంది. కర్నూలులో మెడిసిన్ చేసే సమయంలో ప్రేమించుకున్న వీరిద్దరూ.. అనంతరం వివాహం చేసుకున్నారు.
అప్పటీవకు సంతోషంగా గడిపిన కార్తీక్.. ఉదయాన్నే చూస్తే...
శనివారం రాత్రి వరకు కుటుంబసభ్యులందరీతో సంతోషంగానే ఉన్న కార్తీక్ వర్ధన్.. రాత్రి సాధారణంగానే వెళ్లి పడుకున్నాడు. ఉదయం లేచి చూసేటప్పటికీ ఉరివేసుకొని కనిపించాడని కార్తీక్ సోదరుడు చెప్పాడు. తాము ఉదయాన్నే వెళ్లి డోరు తెరిచే సమయానికి విగత జీవిగా వేలాడుతూ.. కనిపించడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ తలించామని.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఒంటరితనం వల్ల మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబీకులు వెల్లడించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 1వ పట్టణ పోలీసులు.. కేసు నమోదు చేసి వైద్యుడు మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఇదీచదవండి.