అనంతపురం జిల్లా పెనుకొండలో పురాతన విగ్రహాలు పగలగొట్టారని వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని పురావస్తు శాఖ అధికారి రజిత స్పష్టం చేశారు. పెనుకొండలోని గగనమహల్ వద్ద ఉంచిన పాత విగ్రహాలను ఆమె పరిశీలించారు. ఇవి ఇప్పుడు పగలిపోయినవి కాదని చెప్పారు.
2014లో మ్యూజియం ఏర్పాటు చేసి అక్కడ వీటిని పెట్టటం కోసం సేకరించినట్లు వివరించారు. ఇటీవల సామాజిక మాద్యమాల్లో విగ్రహాలు పగలగొట్టారని వచ్చిన వార్తలు కేవలం అపోహ మాత్రమేనని ఆమె వివరించారు. ఆమె వెంట పెనుకొండ సీఐ శ్రీహరి, ఎస్సై వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.
ఇదీ చదవండి: