అనంతపురంలో చాలా కుటుంబాలు వేరుశెనగ పంట నమ్ముకుని జీవిస్తున్నాయి. విత్తనాలు మాత్రం తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బెంగళూరు నుంచి అనంతపురంలోని గోరంట్లకు విచ్చేసిన అగ్రికల్చరల్ స్పెషల్ కమిషనర్ అరుణ్ కుమార్... వేరుశెనగ విత్తన పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.....విత్తన సేకరణ విషయంలో ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు గత ప్రభుత్వం చెల్లించక పోవడం వల్ల కొంత కొరత ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం మేలురకం విత్తనాలు ప్రతి రైతుకు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుందని, ఎవరు ఆందోళన పడవద్దని అందరికి విత్తనాలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రాయితీ విత్తనాలు సద్వినియోగం చేసుకోకుండా... బ్లాక్ మర్కెట్ను ప్రోత్సహిస్తున్న రైతులకు భవిష్యత్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తామని... ఇకపై ఇతర రాష్ట్రాల మీద ఆధారపడకుండా మన జిల్లాలోనే విత్తనాన్ని సేకరించే దిశగా అడుగులు వేస్తామని అరుణ్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: వెంకీని రాబందులు పొడిచిన వేళ..