ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న సరిహద్దుల గుర్తింపునకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కర్ణాటక ప్రాంతమైన తోరణగల్లోని జిందాల్లో బళ్లారి కలెక్టర్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులను గుర్తించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయే నాటికి ఉన్న సరిహద్దు రికార్డులను అధికారులు పరిశీలించారు.
సర్వే ఆఫ్ ఇండియా ల్యాండ్స్, మైన్స్ అండ్ జువాలజీ, అటవీశాఖ అధికారులు రికార్డులను పరిశీలించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో వివాదాస్పద సరిహద్దులను పరిశీలించనున్నారు. గతంలో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారులు పలుమార్లు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు సర్వే చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ప్రస్తుతం మరోసారి అధికారులు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు కసరత్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :