అనంతపురం జిల్లా నార్పల మేజర్ పంచాయతీకి... లక్ష్మీనారాయణమ్మ అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ మద్దతు దక్కని కారణంగా.. రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పోటీ కోసం.. లక్ష్మీనారాయణమ్మ తన అంగన్వాడీ టీచర్ పదవికి రాజీనామా సైతం చేశారు.
గ్రామస్థులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతోనే.. తాను ఉద్యోగం వదిలి గ్రామానికి వచ్చానని ఆమె వెల్లడించారు. గతంలోనూ ఈమె కుటుంబ సభ్యులు బరిలో నిలబడి ఓటమి పాలయ్యారు. అయినా.. పట్టు వదలకుండా.. ఆమె పోటీకి నిలబడటం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: