అనంతపురం జిల్లా కదిరి రీజనల్ బ్యాంకు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతపురం, కడప, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 552 శాఖలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. వీటి ద్వారా 82 లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. అన్ని వర్గాల ఖాతాదారులకు తమ బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ప్రధానంగా తమ బ్యాంకు గ్రామీణ మండల స్థాయిలోనే అత్యధిక శాఖలను కలిగి ఉందని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 362 శాఖలు, మండల కేంద్రాలలో 144, జిల్లా కేంద్రాలలో 82 శాఖలు ఉన్నట్లు ఆయన చెప్పారు. 2019-20 సంవత్సరంలో తమ బ్యాంకు 280 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆయన తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు నిరర్ధక ఆస్తులను బాగా తగ్గించిదన్నారు.
ఇది చదవండి కేరళ ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్