Anganwadi center Aaya : బాలుడు అంగన్వాడీ కేంద్రంలో ఉండటం లేదని అక్కడ పనిచేస్తున్న ఆయా మూడేళ్ల చిన్నారి మూతిపై వాత పెట్టి గాయపరిచిందని పిల్లవాడి తల్లి ఆరోపిస్తోంది. అనంతపురం కొవ్వూరు నగర్‌లో లక్ష్మీదేవి, శింగారెడ్డి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఈశ్వర్ కృష్ణారెడ్డి అనే మూడేళ్ల బాలుడు ఉన్నాడు. కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ఈ చిన్నారిని పంపిస్తున్నామని, రోజూలాగే ఈ రోజూ వదిలిపెట్టి వచ్చామని తల్లి చెబుతోంది.
బాలుడు అమ్మ కావాలంటూ ఏడవడంతో ఆయా చెన్నమ్మ.. బాలుడి మూతిపై వాత పెట్టిందని తల్లి ఆరోపిస్తోంది. దీంతో.. బాలుడు మూతిపై బొబ్బలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ఆ తర్వాత కర్రతో కొట్టిందని తెలిపింది. కొట్టడంతో బాలుడి కాళ్లు, వీపుపై వాతలు పడి ఎర్రగా కమిలిపోయాయని వివరించింది. ఆయాపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఫోనులో మాట్లాడి ఆరా తీశారు. స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి : Pawan kalyan: ఏలూరులో పవన్ పర్యటన.. కౌలు రైతు కుటుంబాలకు పరామర్శ