అనంతపురం...
తెలుగుదేశం అభ్యర్థి ప్రభాకర్ చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. నగరంలో ప్రధాన వీధుల మీదుగా ప్రదర్శనగా వెళ్లి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. వందలాంది మంది కార్యకర్తలు, పట్టణ మేయర్, పలువురు కార్పొరేటర్లు ఆయనకు మద్దతుగా తరలివచ్చారు. తెదేపా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ప్రభాకర్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు.
పుట్టపర్తి...
తెదేపా అభ్యర్థి పల్లె రఘునాథ రెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.అంతకు ముందు సత్యమ్మతల్లి దేవాలయంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంద్రీనీవా నీరు తీసుకురావటానికి సీఎం చేసిన కృషి మరువలేనిదన్నారు.
ఉరవకొండ...
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రజలు మార్పు కోసం జగన్ను కోరుకుంటున్నారన్నారు. అన్ని రంగాల్లో తెదేపా ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.
కదిరి...
కదిరి నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థిగా పీవీ సిద్ధారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అత్యంత వెనకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రజలకుసిద్ధారెడ్డి విజ్ఞప్తి చేశారు.
హిందూపూర్...
కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి బాలాజీ మనోహర్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని,... హిందూపురంను సత్యసాయి జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి.