అనంతపురం జిల్లా తనకల్లు మండలం వంకపల్లికి చెందిన శ్రీ రాములు, లలితమ్మ దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాన్ని కరోనా అల్లకల్లోలం చేసింది. శ్రీరాములుకు కరోనా సోకింది. చికిత్స పొందుతూ రెండు నెలల కిందట మృతిచెందాడు. భర్త మృతిని జీర్ణించుకోలేని లలితమ్మ అనారోగ్యం బారిన పడింది. శక్తిని కూడదీసుకుని పిల్లల కోసమైనా బతకాలని ఆరాటపడింది కానీ అనారోగ్యంతో చనిపోయింది. దాంతో పిల్లలు స్పందన (17), తరుణ్(15) అనాథలయ్యారు. "అప్పుడు నాన్నను ఇప్పుడు అమ్మను రెండు నెలల వ్యవధిలో దూరం చేసి దిక్కులేని వాళ్లగా ఎందుకు చేశావు దేవుడా" అంటూ ఆ పిల్లలు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. ఈ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు
ఇదీ చదవండి: జలదిగ్భందంలోనే గ్రామాలు..పోలవరం నిర్వాసితుల వెతలు!