ETV Bharat / state

మావోయిస్టులకు పేలుడు సామాగ్రిని తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్

author img

By

Published : Jun 9, 2020, 10:51 PM IST

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టులకు పేలుడు సామాగ్రిని తరలిస్తున్న కొరియర్​తోపాటు, ముగ్గురిని అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పదివేల డిటోనేటర్లు, 1098 మీటర్ల ఫ్యూజు వైర్​ను స్వాధీనం చేసుకున్నారు.

ananthapuram police Arrest of persons moving explosives for Maoists
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

అనంతపురం జిల్లాకు చెందిన మత్తు నాగరాజు అనే వ్యక్తి గత కొద్ది కాలంగా మావోయిస్టులకు కొరియర్​గా పనిచేస్తూ, వారికి అవసరమైన మందులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఇచ్చేవాడని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. మావోయిస్టు దళ కమాండర్ మంగూతో నాగరాజుకు పరిచయం ఉందని ఎస్పీ తెలిపారు. ఈ తరుణంలోనే మావోయిస్టులు రెండున్నర లక్షల రూపాయలు నాగరాజుకు ఇచ్చి పేలుడు పదార్థాలు కావాలని అనంతపురానికి చెందిన రమణను ఫోనులో సంప్రదించినట్లు చెప్పారు.

మార్చి నెలలో ముత్తు నాగరాజు అనంతపురం వచ్చి లక్ష 60 వేల రూపాయల నగదు రమణకు ఇచ్చి 12వేల డిటోనేటర్లు, 10 కట్టల ఫ్యూజు వైరు సమకూర్చాలని చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. అనంతపురం జిల్లా నార్పలలో పేలుడు పదార్థాల నిల్వ, విక్రయ కేంద్రం(మ్యాగ్జిన్) నిర్వహిస్తున్న డేరంగుల బాబును కలిసి 75 వేల రూపాయలు ఇచ్చి... అతని నుంచి రెండు వేల డిటోనేటర్లు, మూడు కట్టల ఫ్యూజు వైరు తీసుకెళ్లినట్లు తెలిపారు. మిగిలిన డిటోనేటర్లు, ఫ్యూజు వైరు కోసం నాగరాజు అనంతపురం రావటంతో నిఘాపెట్టిన ఇటుకలపల్లి పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు... వీరి నుంచి పదివేల డిటోనేటర్లు, 1098 మీటర్ల ఫ్యూజు వైరును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ఇదీ చదవండి:వాటిని బీఎస్​4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు: రవాణాశాఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.