అనంతపురం జిల్లా మడకశిర మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే తిప్పేస్వామికి వెలుగు యానిమేటర్ల నిరసన సెగ తగిలింది. వార్డు వాలంటరీలు ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సభ జరుగుతుండగా వెలుగు యానిమేటర్లు మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. 'యానిమేటర్లను తొలగించరాదు' అనే నినాదాలతో నిరసన తెలిపారు. సభ ముగించుకొని ఎమ్మెల్యే వస్తుండగా యానిమేటర్లు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యే వారి సమస్యను తెలుసుకుని జీవోలోని నిబంధనలను యానిమేటర్లకు వివరించారు. సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చి అక్కడినుండి వెళ్లిపోయారు.
ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన సర్క్యులర్‌తో గ్రామాల్లోని నాయకుల వేధింపులు అధికమయ్యాయని కృష్ణమూర్తి అనే యానిమేటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే గత 18 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ... ఇదే జీవనాధారంగా బతుకుతున్న యానిమేటర్లను తొలగించరాదని ధర్నాలో పేర్కొన్నారు. పురుష యానిమేటర్లను తొలగించి 40 సంవత్సరాలలోపు ఉన్న మహిళా యానిమేటర్లను నియమించాలని కోరారు.
ఇదీ చదవండీ: