ETV Bharat / state

కుస్తీ పోటీల్లో రాణిస్తున్నఅనంతపురం యువకుడు.. అదే అతని లక్ష్యం !

Wrestling Player Ramesh: క్రీడల్లో కుస్తీ పోటీలు అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం క్రమం తప్పకుండా కఠినమైన వ్యాయామం, పౌష్టికాహారం, కఠోర శిక్షణ అత్యంత ప్రధానమైన అంశాలు. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న క్రీడకు ఓ నిరుపేద పోటీపడటం సాధ్యమయ్యే పనేనా...వాస్తవానికి అయితే అసలు సాధ్యం కాదు. కానీ అత్యంత పేదరికంలో పుట్టిన ఈ యువకుడు మాత్రం చిన్ననాటి నుంచే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. కుస్తీ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సాధించాడు. భవిష్యత్‌లో ఒలంపిక్స్‌ పతకాన్ని సాధిస్తానని అంటున్నాడు ఈ సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కుస్తీ క్రీడాకారుడు రమేశ్‌.

కుస్తీ పోటీల్లో రాణిస్తున్న రమేష్
కుస్తీ పోటీల్లో రాణిస్తున్న రమేష్
author img

By

Published : Jun 29, 2022, 9:35 AM IST

కుస్తీ పోటీల్లో రాణిస్తున్నఅనంతపురం యువకుడు.. అదే అతని లక్ష్యం !

నిరుపేద కుటుంబంలో జన్మించిన రమేష్ చిన్నతనం నుంచే చదువుతో పాటు క్రీడల్లోనూ మంచి ప్రతిభ కనబరిచేవాడు. రమేష్ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబభారాన్ని తల్లి భరించాల్సి వచ్చింది. దీంతో ఇంట్లో మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఆర్థిక కారణాల వల్ల కుటుంబంలోని అందరిని చదివించలేని తల్లి.. ఏడవ సంతానం అయిన రమేశ్‌ను మాత్రమే చదివించింది. తల్లిదండ్రుల కలలు సాకారం చేసేలా లక్ష్యసాధనతో ఏదో సాధించాలని నిత్యం తపనపడేవాడు. ఆ పట్టుదలను చూసిన కుటుంబసభ్యులందరూ అతడికి అండగా నిలిచారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ఈ స్థాయికి రావడానికి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్లు రమేశ్‌ చెబుతున్నాడు.

శ్రీరంగరాజుపల్లికి చెందిన రమేశ్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఆ సమయంలోనే ఈ యువకుడి ప్రతిభను గుర్తించిన ఆంగ్ల ఉపాధ్యాయుడు రామాంజనేయులు వ్యాయామ శిక్షకుడిగా మారి శిక్షణ ఇచ్చారు. పాఠశాల చదువు పూర్తికాగానే హిందూపురంలోనే ఇంటర్, డిగ్రీ వరకు చదివారు. కళాశాలలో చేరినప్పటికీ తాను క్రీడాకారుడు కావాలనే లక్ష్యం మాత్రం మరిచిపోలేదు. కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడు రమేష్ శక్తిసామర్థ్యాలు గుర్తించి కుస్తీపోటీల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. చిన్నప్పుడే రమేష్ ప్రతిభను గుర్తించి తానే శిక్షణ ఇచ్చానని ఆంగ్ల ఉపాధ్యాయుడు చెబుతున్నారు.

కళాశాలలో ఎన్​సీపీ క్యాడెట్‌గా చేరి బీ, సీ సర్టిఫికెట్లు సాధించాడు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఎన్​సీపీ నిర్వహించే తల్ సైనిక్ క్యాడెట్- టీఎస్​పీ శిక్షణ తీసుకొని ఏపీ నుంచి దిల్లీలో రైఫిల్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో గెలుపు, ఓటములు చూసిన రమేష్ కుస్తీ పోటీల్లో రాటుదేలిపోయాడు. కుస్తీ పోటీల్లో అంచెలంచెలుగా ఎదిగిన రమేష్ ఇటీవలే రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కుస్తీపోటీల్లో పాల్గొని ఐదో స్థానంలో నిలిచాడు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన రమేశ్‌ అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నిలవడంపై తల్లి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ స్థాయి కుస్తీలో సాధించిన మెడల్స్, ఎన్​సీపీ ప్రతిభ రిజర్వేషన్‌తో రమేష్ సచివాలయంలో గ్రామ కార్యదర్శి ఉద్యోగం కూడా సాధించాడు. అయితే ఎస్ఐ ఉద్యోగం సాధించటం టార్గెట్‌గా పెట్టుకున్నరమేష్ రెండు సార్లు రాతపరీక్షలో విఫలమయ్యాడు. సచివాలయ కార్యదర్శిగా పనిచేస్తూనే ఎస్ఐ ఉద్యోగానికి శిక్షణ తీసుకుంటూ.. ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించి పట్టుదలనే ఆయుధంగా మార్చి.. అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న రమేష్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.