స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అనంతపురం పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక విమల ఫరూక్ నగర్, పంతుల కాలనీ, సీబీఎన్ కొట్టాల రూరల్, రుద్రంపేటలలో తనిఖీలు చేపట్టారు. అనంతరం రుద్రంపేటలో గ్రామ సభ నిర్వహించి.. ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల వేళ అల్లర్లకు దిగితే చట్టపరమైన చర్యలు తప్ఫవుని హెచ్చరించారు.
ఎన్నికల నియమావళి గురించి ప్రజలకు అవగాహన కల్పించి.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ... వంటి అక్రమాలకు పాల్పడరాదని హెచ్చరించారు. నామినేషన్ రోజు కేంద్రానికి అభ్యర్థి, అతన్ని బలపరిచే ఇద్దరు వ్యక్తులు మాత్రమే రావాలని సూచించారు. గొడవలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వీర రాఘవ రెడ్డి, నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... దశాబ్దాలుగా ఎల్బీపట్నం సర్పంచ్‌లుగా బండారు కుటుంబీకులు