అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది పేదల నుంచి వేలకు వేలకు వసూలు చేస్తున్నారు. కరోనాతో చనిపోతే పేదలు అంత్యక్రియలకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఒక నిరుపేద వ్యక్తి అంత్యక్రియలకు రూ.60వేలు డిమాండ్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం నందమూరినగర్కు చెందిన బొమ్మయ్య అనే వ్యక్తి ఊపిరాడని పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చాడు. అయితే అక్కడ కనీసం వీల్చైైర్ కూడా లేకపోవటంతో బంధువులు చేతుల మీద తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. బొమ్మయ్య చికిత్స పొందుతూ చనిపోయాడు.
వార్డులోని సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించేందుకు 60వేల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు రూ.45వేలకు తక్కువ చేయమని తెగేసి చెప్పారు. వారు డబ్బు డిమాండ్ చేసిన సంఘటన ఆడియో వైరల్గా మారింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సరిగా అందకపోటమే కాకుండా ఇలా చనిపోయిన తరువాత కూడా జలగల్లా పీడిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి