ETV Bharat / state

మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్​లో గేమ్స్... ఆ తర్వాత పరిస్థితి చూస్తే.. - పబ్జి ఆడి మతిస్థిమితం కోల్పోయిన యువకుడు

PUBG causes for mind lost: స్మార్ట్ ఫోన్​తో ఎన్ని ఉపయోగలున్నాయో.. వ్యసనంగా మారితే అన్ని అనర్థాలు కూడా వెన్నంటే ఉంటాయి. అలాంటి ఘటనే అనంతపురం జిల్లా బెణకల్లులో జరిగింది. వినేందుకు కాస్త విచిత్రమైనా అదే వాస్తవం. ఆ వివరాలు ఏంటంటే...

An young man lost his mind
మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్లో గేమ్స్...మతిస్థిమితం కోల్పోయిన యువకుడు
author img

By

Published : Feb 5, 2022, 5:30 PM IST

An young man lost his mind due to pubg: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం బెణకల్లు గ్రామానికి చెందిన 19ఏళ్ల యువకుడు మహేష్ ఇంటర్ చదువుతూ...మధ్యలో మానేశాడు.రోజువారి కూలి పనులకు వెళ్తూ..వచ్చిన సొమ్ముతో బతుకుతున్నాడు. ఇలా కూలి చేయగా వచ్చిన డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొన్నాడు. కొత్త ఫోన్​లో రకరకాల ఆటలు ఆడుతూ గడిపేవాడు. ఫోన్ రాక ముందు అందరితో కలివిడిగా..సరదాగా కలిసి గడిపిన మహేష్ మారిపోయాడు. రోజులో ఎక్కువ సమయం ఫోన్​తోనే గడపడం మొదలుపెట్టాడు. పగలూ,రాత్రి తేడా లేకుండా స్మార్ట్ ఫోన్​లో మునిగి తేలేవాడు. పబ్జి మొబైల్ గేమ్స్ ఆడుతూ ఫోన్​కు బానిసయ్యాడు. చివరకు పనులు కూడా మానేసి ఇంట్లో ఉంటూ రాత్రి, పగలు తేడా లేకుండా స్మార్ట్ ఫోన్​తోనే గడిపేవాడు. ఇలా 3 నెలలు నిద్ర కూడా మానేశాడు. దీంతో మహేష్ ఆరోగ్యం క్షీణించింది.

మూడు నెలలుగా స్మార్ట్ ఫోన్లో గేమ్స్...మతిస్థిమితం కోల్పోయిన యువకుడు

ఆ తర్వాత నుంచి మహేష్​ ఏం మాట్లాడుతున్నాడో.. ఎదుటివారు ఏమి అడుగుతున్నారో కూడా తెలుసుకోలేని స్థితికి చేరాడు. దీంతో ఆందోళన చెందిన మహేష్ తల్లిదండ్రులు, మంత్రగాడి వద్దకు కూడా తీసుకెళ్లారు. నయం కాకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్​కు వెళ్లారు. సమస్యను అర్థం చేసుకున్న ల్యాబ్ టెక్నీషియన్.. పూర్తి వివరాలు రాబట్టాడు. స్మార్ట్ ఫోన్ కారణంగా మహేష్ ఈ స్థితికి చేరుకున్నట్లు గుర్తించాడు. మెరుగైన చికిత్స కోసం వైద్యనిపుణులను సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి :

Minister Balineni On Power Cut: రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి ?: మంత్రి బాలినేని

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.