గుంటూరులోని బ్రాడిపేట 32వ డివిజన్లో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతుందని... గత కొన్ని రోజులుగా కేసులు నమోదు కాాకపోవడం శుభపరిణామమని మద్దాలి గిరి అన్నారు. ప్రజలు మరికొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు... భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని ఎమ్మెల్యే అన్నారు.
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని ఎర్రబొమ్మనహళ్లి గ్రామంలో ఉపాధి కోసం వచ్చిన మహారాష్ట్ర వలస కూలీలకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు నిత్యావసర సరకులను అందించి దాతృత్వం చాటుకున్నారు.