ETV Bharat / state

అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు గ్రహణం..కేంద్రం సహకరిస్తున్నా.. - గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌

ANANTAPUR AMARAVTI EXPRESS WAY : అమరావతిపై వైకాపా ప్రభుత్వ ద్వేషం.. రాయలసీమ వాసుల్నీ ఇబ్బంది పెడుతోంది. కోస్తా, రాయలసీమను అనుసంధానించే అనంతపురం - అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం పట్ల చూపుతున్న అలసత్వం కారణంగా సీమవాసులు.. నష్టపోతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి సహకరించేందుకు కేంద్రం ఇప్పటికే పలుమార్లు సానుకూలత చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపాదనల్ని మార్చుతూ కాలం వెల్లదీస్తోంది. కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్ వే పేరుతో అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేను పక్కనపెట్టడం ద్వారా ప్రజా రాజధానిపై వైకాపా ప్రభుత్వం మరోసారి అక్కసును వెళ్లగక్కింది.

ANANTAPUR AMARAVTI EXPRESS WAY
ANANTAPUR AMARAVTI EXPRESS WAY
author img

By

Published : Nov 7, 2022, 8:35 AM IST

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు గ్రహణం..కేంద్రం సహకరిస్తున్నా..

EXPRESS WAY : కోస్తా, రాయలసీమను అనుసంధానించే కీలకమైన అనంతపురం అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం అడుగు ముందుకుపడటం లేదు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన దీని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నా.. వైకాపా ప్రభుత్వం ప్రతిపాదనలు మార్చుతుండటంతో ఎడతెగని జాప్యం జరుగుతోంది. స్వరూపం మార్చినా.. అసలు ఇది ఉంటుందా, ఉండదా? ఉంటే ఎప్పటికి పనులు ప్రారంభమవుతాయనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానాలు దొరికేలా లేవు.

రాయలసీమ జిల్లాలను అమరావతితో అనుసంధానించే సరైన రహదారి లేదు. సీమ జిల్లాల నుంచి సగటున దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికే సరైన రహదారి లేక 7గంటల వరకూ సమయం పడుతోంది. అదే దాదాపు 800కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖకు వెళ్లాలంటే 15గంటల వరకూ సమయం పడుతోంది.

గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఖరారు చేశాక.. అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ప్రణాళికలు సిద్ధం చేసింది. అనంతపురం, కర్నూలు, కడప నుంచి నేరుగా అమరావతికి నాలుగు గంటల్లోగా వచ్చేందుకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ అవసరాన్ని గుర్తించి.. ప్రాజెక్టు నివేదిక తయారుచేసి కేంద్రానికి పంపింది. భూ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసింది. కేంద్రమూ జాతీయ రహదారిగా గుర్తించి.. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అంగీకరించింది.

ప్రాజెక్టు భూసేకరణ వ్యయంలో సగం భరించేందుకు కేంద్రం సుముఖత చూపింది. ఆరేళ్ల క్రితమే అంటే 2016 ఆగస్టు నాటికే ఈ ప్రాజెక్టుకు ఓ రూపం వచ్చింది. దాదాపు 400 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించాలని ఖరారు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం.. 27,635 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులోనే భూసేకరణ ఖర్చు.. 2,500 కోట్లు ఉంటుందని తేల్చారు. NHAI ఈ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ముందుకొచ్చింది. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న రీతిన వ్యవహారం ఉంది.

ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు.. గత ప్రభుత్వం ఎన్నో సమస్యలను అధిగమించింది. రహదారి నిర్మాణానికి 26,890 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ప్రభుత్వ-ప్రైవేటు భూమి 23,041 ఎకరాలుంటే, ఇందులో ప్రైవేటు భూమి 19వేల ఎకరాలుంది. మరో 3849 ఎకరాల అటవీ భూమి సేకరించాలని నిర్ణయించారు. అటవీ భూమిని తీసుకుని.. అంతే మొత్తంలో అటవీశాఖకు తిరిగి భూమి ఇచ్చేలా ప్రయత్నాలు జరిగాయి.

భూసేకరణ ఖర్చు 2500 కోట్ల రూపాయలు ఎవరు భరించాలన్న దానిపై సందిగ్థత నెలకొంటే.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సగం సగం భరించాలని అవగాహనకు వచ్చాయి. తాడికొండ, ప్రత్తిపాడు, నర్సరావుపేట, వినుకొండ, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, తాడిపత్రి, సింగనమల, అనంతపురం, కర్నూలు, బనగాలపల్లి, డోన్, పాణ్యం, కడప, పులివెందుల, బద్వేలు నియోజకవర్గాలకు లబ్ధి చేకూరేలా రహదారి నిర్మాణానికి... NH-544F అనే నంబరు కూడా కేటాయించారు.

భూ సేకరణ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు భారత్‌ మాల జాబితాలో చేర్చారు. 2018లో అడ్డంకులు తొలగి అంతా ఓ కొలిక్కి వచ్చిందనుకున్న క్రమంలో ప్రభుత్వం మారింది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. అలైన్‌మెంట్‌ను మార్చి.. ఎక్స్‌ప్రెస్‌ వేను చిలుకలూరిపేట బైపాస్ వరకే పరిమితం చేయడంతో తీవ్ర దుమారం చెలరేగింది.

తాజా పరిస్థితిని పరిశీలిస్తే...అమరావతి-అనంతపురం ఎక్స్ ప్రెస్ వే కలలను పూర్తిగా చంపేశాలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. నేరుగా ప్రాజెక్టును ఆపేస్తున్నట్లు ప్రకటించకపోయినప్పటికీ ప్రత్యామ్నాయంగా కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్ వే పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే సాకారమయితే అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు అద్భుతమైన రహదారి కనెక్టివిటీ వస్తుంది. రహదారి వెంటే ఇండస్ట్రియల్‌, గ్రోత్‌ కారిడార్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేవి. ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిస్తున్న కొత్త హైవే వల్ల సీఎం సొంత నియోజకవర్గం పులివెందులకే ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇతర జిల్లాల కనెక్టివిటీలు లేవు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.