SEEDS PEN: సాధారణంగా మనం ఎంత ఖరీదైన పెన్ను కొన్నా.. ఇంకు అయిపోగానే పడేస్తాం. ఈ చిత్రంలో ఉన్న పెన్నును భూమిలో పడేస్తే.. దాని నుంచి మూడు రకాల మొక్కలు మొలుస్తాయి. అనంతపురం నగరానికి చెందిన ఏజీఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో వీటిని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నారు. నగరంలో ప్లాస్టిక్‌ను నిషేధించిన నేపథ్యంలో పర్యావరణానికి మేలు కలిగేలా ఈ పెన్నులను ప్రత్యేకంగా తయారు చేయించారు. పేపర్‌తో తయారైన వీటికి ఒకవైపు రాసుకోవడానికి లిడ్ ఉంటుంది. మరోవైపు (పైభాగంలో) మట్టిలో కలిసిపోయే గుణమున్న ఓ క్యాప్సుల్ ఉంటుంది. అందులో మిరప, వంకాయ, టమాటా విత్తనాలను నింపారు. పెన్నులో సిరా అయిపోగానే పడేస్తే అందులోని పేపర్‌తో పాటు, పైభాగాన ఉన్న విత్తనాలు మట్టిలో కలిసిపోయి మొక్కలు మొలుస్తాయి. సోమవారం నగరంలో సుమారు 5వేల పెన్నులు పంపిణీ చేశారు.
ఇవీ చదవండి: