అనంతపురం జిల్లా ధర్మవరం మండలం దర్శినమల గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. సంస్థ ఖాతాదారుల ఒత్తిడితో మనస్తాపానికి గురైన ఆదినారాయణ... బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో గ్రామంలో పలువురి వద్ద అగ్రిగోల్డ్ డిపాజిట్లను సేకరించి సంస్థకు చెల్లించాడు. అగ్రిగోల్డ్ సంస్థ వివాదంలో ఉండటంతో... సకాలంలో డబ్బులు రాక ఖాతాదారులకు చెల్లించలేకపోయాడు. డబ్బులు ఇవ్వాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఆదినారాయణ మనస్తాపానికి గురయ్యాడు. విషం తాగి అపస్మారక స్థితిలో పడిపోయిన అతనిని... చికిత్స కోసం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. వైద్యం పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: