అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆధార్ కార్డు మార్పులు చేర్పుల కోసం వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో మాత్రమే ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. చాలా రోజులుగా రైల్వే స్టేషన్ రోడ్డులోని ఆధార్ కేంద్రం మాత్రమే పని చేస్తోంది. దీంతో స్థానిక ప్రజలే కాకుండా ఇతర మండలాలకు చెందినవారు, పొరుగు జిల్లా వారు కూడా వందల సంఖ్యలో అక్కడకు వస్తున్నారు. సాంకేతిక సమస్యలు తరుచూ సంభవిస్తుండటం వల్ల రోజుకు 20 మందికి మించి వివరాలు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తహశీల్దార్ తెలిపారు.
ఆధార్ కార్డు మార్పుల చేర్పుల కోసం ప్రజల అవస్థలు - అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆధార్ కార్డు మార్పులు
గుంతకల్లులో ఆధార్ కార్డు మార్పుల చేర్పుల కోసం ప్రజల అవస్థలు పడుతున్నారు. సర్వర్లు మొరాయిండంతో క్యూలైన్లో ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో నమోదు కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
![ఆధార్ కార్డు మార్పుల చేర్పుల కోసం ప్రజల అవస్థలు adhar problems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9827762-1007-9827762-1607581649253.jpg?imwidth=3840)