అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో ఇదయతుల్లా(32) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబం కిరాణ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తారు. ఇతని మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలేం జరిగింది:
కనేకల్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న శ్రీరాములు అనే కానిస్టేబుల్.. ఇదయతుల్లా భార్యను లైంగికంగా వేధిస్తున్నాడని అక్టోబర్ 29న ఫిర్యాదు చేశాడు. శ్రీరాములుతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కేసును దిశా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. పోలీసు ఉన్నతాధికారి కార్యాలయంలో దర్యాప్తు కోసం ఇదయతుల్లా భార్యతో పాటు వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ..తిరిగి వచ్చాక అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన ఆత్మహత్యకు కానిస్టేబుల్ శ్రీరాములు, కనేకల్ ఎస్సై సురేష్ కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం:
మద్యానికి బానిసైన ఇదయతుల్లాను విడిచి పెట్టి అతని భార్య గత వారం పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. తమ ఇంటికి రావాలని ఇదయతుల్లా భార్యను పిలిచాడు. మద్యం అలవాటు మానుకుంటేనే వస్తానని చెప్పటంతో ఇద్దరి మధ్య తగువు జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఇదయతుల్లా ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. దీనిపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రాయదుర్గం రూరల్ సీఐ మీడియాకు తెలిపారు.
కానిస్టేబుల్ శ్రీరాములు అధికార వైకాపా నాయకులతో పాటు బాధితుల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపిపారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసును సద్దుమణిచేందుకు ఇదయతుల్లా భార్యకు ఆరు లక్షలు పరిహారం ఇవ్వాలని పెద్ద మనుషులు తీర్మానం చేశారని సమాచారం. కానిస్టేబుల్‌ను కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు కేసును తమకు నచ్చిన విధంగా మార్చటం దురదృష్టకరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: